Header Banner

మరో ఘోర ప్రమాదం! కేదరనాథ్ వెళుతుండగా కుప్పకూలిన హెలికాఫ్టర్!

  Sun Jun 15, 2025 10:28        India

ఉత్తరాఖండ్‌లో మరో భయానక ఘటన చోటుచేసుకుంది. కేదార్నాథ్ దిశగా ప్రయాణిస్తున్న ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్, గౌరికుండ్ అడవుల్లో కుప్పకూలింది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటన ఉదయం 5:30 గంటల సమయంలో చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. హెలికాప్టర్‌లో ఐదుగురు ప్రయాణికులు మరియు పైలట్ ఉన్నారు. ఈ ప్రమాదంలో విక్రమ్ రావత్, రాజ్ వీర్, వినోద్, తృష్టి సింగ్, రాజ్ కుమార్, శ్రద్ధ అనే మహిళ మరియు 10ఏళ్ల రాశి అనే బాలిక మరణించారు. పైలట్‌తో పాటు మరో ప్రయాణికుడు గాయాలతో బయటపడ్డారు.

 

ఇది కూడా చదవండి: నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

ప్రమాద స్థలానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. సంఘటన గురించి హెలికాప్టర్ నోడల్ అధికారి రాహుల్ చౌడే ధృవీకరించారు. గౌరికుండ్‌ సమీపంలోని గడ్డి కోసేందుకు వెళ్లిన మహిళలు ఈ ప్రమాదాన్ని చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇటీవలి కాలంలో ఇదే మార్గంలో ఇదే మాదిరిగా మూడో ప్రమాదం జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జూన్ 7న కూడా ఒక హెలికాప్టర్ సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ప్రమాదాలతో కేదార్నాథ్ యాత్రలో భద్రతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

 అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నూతన నియామకాలు! ప్రభుత్వం జీవో జారీ!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

అమెరికాలో వలసదారులకు షాక్! ట్రంప్ సంచలన నిర్ణయం... నోటీసులు జారీ!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు గుడ్ న్యూస్! కేంద్రం గ్రీన్ సిగ్నల్! డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు జమ!

 

తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...

 

కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!

 

ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #KedarnathHelicopterCrash #UttarakhandAccident #HelicopterCrash #KedarnathYatra #AryanAviation #TragicAccident #UttarakhandNews #PilgrimageTragedy #NDREfforts #SDREFFeedback #HelicopterSafety #DevoteesLost #KedarnathDisaster #BreakingNews #RIPVictims